భారత్ న్యూస్ హైదరాబాద్ …శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ.3 కోట్ల విలువైన బంగారం పట్టివేత
హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. కౌలాలంపూర్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద రూ. 3.36 కోట్ల విలువైన 2.271 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
జూన్ 24న, ప్యాంటు నడుము భాగంలో ప్రత్యేకంగా కుట్టిన పౌచ్‌లలో పేస్ట్ రూపంలో దాచి తరలిస్తున్న ఈ 24 క్యారెట్ల బంగారాన్ని అధికారులు సీజ్ చేసి, నిందితులను అరెస్టు చేశారు…..
