భారత్ న్యూస్ ఢిల్లీ…..2027 దాకా ఎల్‌నినో ఎఫెక్ట్.. వేడేక్కనున్న సముద్రాలు.. వర్షాలపైనా తీవ్ర ప్రభావం!
🌅మధ్య పసిఫిక్ మహాసముద్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఎల్ నినో ప్రభావం వల్ల భారతదేశంలో నైరుతి రుతుపవనాల సీజన్ ఆరంభంలో ఇప్పటికే తీవ్ర వర్షపాత లోటు ఏర్పడింది. ఈ ప్రభావం త్వరగా తొలగిపోయేలా లేదు. ఇది 2027 ఫిబ్రవరి వరకు కొనసాగుతుందని అంచనా.

🌅ఎల్ నినో ఇంత దీర్ఘకాలం ఉండటం వల్ల కేవలం మత్స్య పరిశ్రమపైన, బంగాళాఖాతం, అరేబియా సముద్రాల స్థితిగతులపైన ప్రభావం చూపడమే కాకుండా 2027 నాటి భారతీయ రుతుపవన సీజన్‌పై కూడా ఇది ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు అంచనా.
🌅ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్(ఇన్‌కోయిస్) ఎల్ నినోపై సోమవారం తన మొదటి బులెటిన్‌ను విడుదల చేస్తూ 2026 జూన్ నుంచి 2027 ఫిబ్రవరి వరకు ఎల్‌నినో ప్రభావం కొనసాగుతుందని అంచనా వేసింది.