చికెన్, మటన్ షాపులకు గుడ్‌బై.. శాకాహార నగరంగా మారనున్న వారణాసి!

భారత్ న్యూస్ విజయవాడ…చికెన్, మటన్ షాపులకు గుడ్‌బై.. శాకాహార నగరంగా మారనున్న వారణాసి!

🔹ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నగరం త్వరలో శాకాహార నగరంగా మారనుంది! ఆ నగర మున్సిపల్‌ కార్పొరేషన్‌(వీఎంసీ) తన పరిధిలోని మాంసం, చేపలు, కోళ్ల దుకాణాలను నగర శివార్లకు తరలించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా నగర పరిధిలో ఉన్న 350 నుంచి 400 మాంసం దుకాణాలను రాబోయే ఆరు నెలల్లో విడతల వారీగా దీపావళి లోపు శివార్లకు తరలించేందుకు సన్నాహాలు చేస్తోంది.

🔹ఈ దుకాణాలను రామ్‌నగర్‌, సుజాబాద్‌, గణేశ్‌పూర్‌, అవలేష్‌ నగర్‌, శివపూర్‌ ప్రాంతాలకు తరలించనున్నారు. దీంతో కాశీ నగరం దేశంలోని రెండవ శాకాహార నగరంగా మారనుంది. ప్రస్తుతం ప్రపంచంలోని ఏకైక పూర్తి శాకాహార పట్టణంగా గుజరాత్‌లోని ‘పాలితానా’ గుర్తింపు పొందింది. ఇక్కడ 2014 నుంచి మాసం, చేపలు, గుడ్ల విక్రయాలపై నిషేధం అమల్లో ఉంది. వారణాసిలో హిందువులు 72 శాతం, ముస్లింలు 27 శాతం ఉన్నారనే అంచనాలున్నాయి.