హ‌ర్మూజ్ దారి క్లియ‌ర్‌.. జ‌ల‌సంధిని దాటిన 30 భార‌త నౌక‌లు, క్యూ లైన్‌లో మ‌రో 26 షిప్స్‌..!

భారత్ న్యూస్ రాజమండ్రి…హ‌ర్మూజ్ దారి క్లియ‌ర్‌.. జ‌ల‌సంధిని దాటిన 30 భార‌త నౌక‌లు, క్యూ లైన్‌లో మ‌రో 26 షిప్స్‌..!

ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన ‘హర్మూజ్ జలసంధి (Strait of Hormuz)’ లో నెలకొన్న ఉద్రిక్తతలు ఎట్టకేలకు తగ్గుముఖం పట్టాయి. అమెరికా, ఇరాన్ (US, Iran) దేశాల మధ్య జరిగిన దౌత్యపరమైన చర్చలు సఫలం కావడంతో ఈ సముద్ర మార్గంలో నౌకల రాకపోకలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. ఈ పరిణామం మ‌న దేశానికి పెద్ద ఊరటనిచ్చింది. భారత్‌ (India) కు చెందిన‌ 30 నౌకలు ఇప్పటికే సురక్షితంగా హ‌ర్మూజ్‌ జలసంధిని దాటాయి. మరో 26 నౌకలు ప్రయాణ అనుమతి కోసం క్యూలైన్‌లో వేచి ఉన్నాయి. భారత షిప్పింగ్ మంత్రిత్వ శాఖ (India’s shipping Ministry) వ‌ర్గాలు ఈ విష‌యాన్ని వెల్లడించాయి.