భారత్ న్యూస్ ఢిల్లీ…..ప్రధాని మోదీతో అమెజాన్ సీఈవో భేటీ.. రూ.లక్షల కోట్ల పెట్టుబడులు
2026 నుంచి 2030 మధ్య కాలంలో దేశంలో ఏకంగా 48 బిలియన్ డాలర్ల (సుమారు రూ.4.53 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు అమెజాన్ ప్రకటించింది.
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను విస్తరించడానికి 2030 నాటికి అదనంగా 13 బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు ఆండీ జెస్సీ తెలిపారు.

గత కొన్నేళ్లుగా భారత్‌లో 12 మిలియన్ల చిన్న వ్యాపారాలను డిజిటలైజ్ చేశామని, 20 బిలియన్ డాలర్ల విలువైన ఈ-కామర్స్ ఎగుమతులను సాధ్యం చేశామని, ప్రత్యక్షంగా, పరోక్షంగా 2.8 మిలియన్ల ఉద్యోగాలకు మద్దతు ఇచ్చామని అమెజాన్ కంపెనీ వివరించింది.
రానున్న కాలంలో 3.8 మిలియన్ల ఉద్యోగాలకు మద్దతు ఇవ్వడం, 80 బిలియన్ డాలర్ల సంచిత ఎగుమతులు సాధించడం, 15 మిలియన్ల చిన్న వ్యాపారాలకు ఏఐ ప్రయోజనాలు అందించడం, 4 మిలియన్ల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏఐ విద్యను అందించడం వంటి లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు అమెజాన్ వెల్లడించింది.
2010 నుంచి 2030 వరకు భారత్‌లో అమెజాన్ పెట్టిన మొత్తం పెట్టుబడుల విలువ 88 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది.