భారత్ న్యూస్ వరంగల్…ఆ ఏడు రకాల సన్న ధాన్యానికే బోనస్.. రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ
తెలంగాణ :
వానాకాలం పంట సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో సన్నరకం వడ్లు పండించే రైతులకు ఇస్తున్న బోనస్ పై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
ఈ సీజన్ నుంచి 7 రకాల వరి ధాన్యాలకు మాత్రమే బోనస్(క్వింటాకు రూ.500) చెల్లిస్తామని ప్రకటించింది.
ఈ విషయమై రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం విత్తన మేళా కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

బీపీటీ- 5204, ఆర్ఎన్ఆర్-15048, కేఎన్ఎం-1638, జైశ్రీరామ్, హెచ్ఎంటీ సోనా, వరంగల్-44, కేఎన్ఎం- 7715 రకాల సన్న ధాన్యానికే బోనస్ వర్తించనుందని అధికారులు చెబుతున్నారు.