రాజ్యసభ ఎంపీల ఆస్తులు రూ.26,047 కోట్లు: ఏడీఆర్ నివేదిక

భారత్ న్యూస్ ఢిల్లీ…..రాజ్యసభ ఎంపీల ఆస్తులు రూ.26,047 కోట్లు: ఏడీఆర్ నివేదిక

రాజ్యసభ ఎంపీల ఆస్తులు రూ.26,047 కోట్లు: ఏడీఆర్ నివేదిక
రాజ్యసభలోని 226 మంది సభ్యుల మొత్తం ఆస్తుల విలువ రూ.26,047 కోట్లుగా ఉందని, సగటున ఒక్కో ఎంపీ ఆస్తి రూ.115.25 కోట్లు అని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌), నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ సంయుక్తంగా వెల్లడించాయి. అత్యధికంగా తెలంగాణకు చెందిన బీఆర్‌ఎస్‌ ఎంపీ బండి పార్థసారథిరెడ్డి రూ.5,300 కోట్లతో దేశంలోనే అత్యంత సంపన్న రాజ్యసభ సభ్యుడిగా నిలిచారు. రాష్ట్రాల వారీగా చూస్తే తెలంగాణ నుంచి ఏడుగురు సభ్యుల మొత్తం ఆస్తుల విలువ రూ.8,310 కోట్లుగా ఉంది. 69 మంది (31 శాతం) తమపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు అఫిడవిట్లలో పేర్కొన్నారు. బీఆర్‌ఎస్, సీపీఎంకు చెందిన వంద శాతం ఎంపీలపై కేసులున్నాయి