మళ్లీ టెలిగ్రామ్ అందుబాటులోకి…

భారత్ న్యూస్ విశాఖపట్నం..మళ్లీ టెలిగ్రామ్ అందుబాటులోకి…

ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ తిరిగి యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. గూగుల్ ప్లేస్టోర్లో కూడా దీనిని పునరుద్ధరించారు. ప్రస్తుతానికి యాపిల్ యాప్ స్టోర్లో మాత్రం డీలిస్ట్ అయ్యే కనిపిస్తోంది.

నీట్ రీటెస్ట్ నేపథ్యంలో టెలిగ్రామై జూన్ 16న కేంద్రం తాత్కాలిక నిషేధం విధించిన సంగతి తెలిసిందే. నీట్ పునఃపరీక్ష నేపథ్యంలో ఈ నెల 22 వరకు టెలిగ్రామ్ యాప్పై, ఈ నెల 30 వరకు మెసేజింగ్ ఎడిటింగ్ ఫీచర్పై ఆంక్షలు విధించింది. ఆ పేపర్ లీక్ వ్యవహారంలో ఎన్టీఏ సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. గతనెల 3న జరిగిన నీట్ ప్రశ్న పత్రాలు లీకైన నేపథ్యంలో దాన్ని రద్దు చేసి.. ‘నీట్ – యూజీ’ని ఈనెల 21న తిరిగి నిర్వహించారు.