నమ్మకమే నేరానికి దారి..!

భారత్ న్యూస్ హైదరాబాద్ …నమ్మకమే నేరానికి దారి..!

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి బౌరంపేటలో భారీ దొంగతనం కేసును దుండిగల్ పోలీసులు కేవలం 12 గంటల్లోనే ఛేదించారు.

సహోద్యోగి లక్ష్మీనారాయణ్ అప్పుల కారణంగా సునీల ఇంట్లో సుమారు 40 తులాల బంగారు ఆభరణాలు చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు.

తాళాలు చెదరకుండా చోరీ జరగడంతో కేసు మిస్టరీగా మారినా, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకుని బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి వెల్లడించారు….