భారత్ న్యూస్ విజయవాడ…పవన్పై అనుచిత వ్యాఖ్యల కేసు.. విచారణకు హాజరైన ఎమ్మెల్సీ దువ్వాడ
హిరమండలం: శ్రీకాకుళం జిల్లా కొత్తూరు పీఎస్లో విచారణకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దువ్వాడ శ్రీనివాస్ హాజరయ్యారు. 2025 మార్చిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ప సోషల్ మీడియాలో దువ్వాడ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో గొట్ట గ్రామానికి చెందిన జనసేన నాయకుడు పి.చిన్నారావు అప్పట్లో ఆయనపై హిరమండలం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు

దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. కొత్తూరు పీఎస్లో విచారణకు హాజరుకావాలని దువ్వాడ శ్రీనివాస్కు సీఐ సీహెచ్ ప్రసాదరావు రెండుసార్లు నోటీసులు ఇచ్చారు. ఆయన హాజరు కాకపోవడంతో మూడోసారి ఈనెల 20న మరోసారి నోటీసు జారీ చేశారు. దీంతో సోమవారం దువ్వాడ శ్రీనివాస్ కొత్తూరు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. మరోవైపు ఆయనతో పాటు పీఎస్ వద్దకు దివ్వెల మాధురి, అనుచరులు చేరుకున్నారు. పీఎస్ ముందు వారు బైఠాయించిన నిరసన తెలిపారు