భారత్ న్యూస్ శ్రీకాకుళం….సీబీఐకి పల్నాడు ఎస్పీ బి కృష్ణారావు
నరసరావుపేట: పల్నాడు జిల్లా ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు కేంద్ర సర్వీసుకు బదిలీ అయ్యారు. కేంద్ర హోం శాఖకు చెందిన కీలక దర్యాప్తు సంస్థ సీబీఐలో ఎస్పీ హోదాలో డిప్యూటేషన్‌పై నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరికొద్ది రోజుల్లో ఆయన పల్నాడు జిల్లా నుంచి రిలీవ్ కానున్నారు.
