నీట్ విద్యార్థులకు ఆర్టీసీ ఫ్రీ ప్రయాణం

భారత్ న్యూస్ హైదరాబాద్ …నీట్ విద్యార్థులకు ఆర్టీసీ ఫ్రీ ప్రయాణం

జూన్ 21న జరిగే నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

నీట్ పరీక్ష రాసే విద్యార్థులు హాల్ టికెట్ చూపిస్తే ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

ఈ మేరకు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.