భారత్ న్యూస్ శ్రీకాకుళం….పాలకాయతిప్ప, హంసలదీవి గ్రామాలకు ట్యాంకరుతో త్రాగునీరు సరఫరా
కోడూరు మండల పరిధిలోని పాలకాయతిప్ప, హంసలదీవి గ్రామాలకు సోమవారం వాటర్ ట్యాంకరుతో త్రాగునీరు సరఫరా చేశారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచన మేరకు కోడూరు టౌన్ జనసేన పార్టీ అధ్యక్షులు కోట రాంబాబు వాటర్ ట్యాంకరుతో త్రాగునీరు సరఫరా చేశారు. ఉదయం హంసలదీవి గ్రామానికి నాలుగు వేల లీటర్లు, సాయంత్రం పాలకాయతిప్పకు నాలుగు వేల లీటర్ల త్రాగునీరు అందచేశారు. ఈ రెండు గ్రామాల కూడా త్రాగునీరు సరఫరా కొనసాగిస్తున్నట్లు రాంబాబు తెలిపారు.
