నేడే ‘పరమ ఏకాదశి’.. ఇలా చేస్తే పాపాల నుంచి విముక్తి!

భారత్ న్యూస్ తిరుపతి…..నేడే ‘పరమ ఏకాదశి’.. ఇలా చేస్తే పాపాల నుంచి విముక్తి!

ఈ రోజే మూడేళ్లకు ఒకసారి వచ్చే పవిత్రమైన ‘పరమ ఏకాదశి’. ఈ రోజు ఉపవాసం ఉంటే పాప విముక్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఉపవాసం రోజున పగటి నిద్ర, అహింస, కోపం, ద్వేషం, చెడు ఆలోచనలు చేయరాదు. ఉప్పు సేవించకూడదు. తులసి ఆకులను తుంచడం చేయకూడదని పండితులు సూచిస్తున్నారు. ఉపవాస నియమాలను పాటిస్తూ, బ్రహ్మచర్యం వహిస్తూ దైవ చింతనలో ఉండటం వలన ఈ వ్రత ఫలితం దక్కుతుందని పండితులు చెబుతున్నారు.