నానక్‌రామ్‌గూడలోని డ్రగ్ కింగ్‌పిన్ నితూ భాయ్ ఇంటిపై EAGLE FORCE TELANGANA దాడి చేసింది.

భారత్ న్యూస్ హైదరాబాద్ …నానక్‌రామ్‌గూడలోని డ్రగ్ కింగ్‌పిన్ నితూ భాయ్ ఇంటిపై EAGLE FORCE TELANGANA దాడి చేసింది.

సుమారు 50 మంది ఐటీ ఉద్యోగులు అదుపులోకి తీసుకోబడ్డారు. అయితే ముందస్తు సమాచారం అందడంతో నితూ భాయ్ అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం.

ధూల్‌పేట్‌కు చెందిన నితూ భాయ్ ఐటీ కారిడార్‌లో అడ్డా పెట్టి, కిరాణా షాపు ముసుగులో గంజాయి విక్రయాలు కొనసాగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

ప్రతిరోజు రూ.5 నుంచి రూ.10 లక్షల వరకు గంజాయి అమ్మకాల ద్వారా సంపాదిస్తున్నట్లు సమాచారం. గతంలోనూ అరెస్ట్ అయిన నితూ భాయ్‌పై పీడీ యాక్ట్ పెట్టారు

జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్లీ గంజాయి వ్యాపారం కొనసాగిస్తున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. డ్రగ్స్ నెట్‌వర్క్‌ను నిర్మూలించేందుకు ఈగల్ ఫోర్స్ తీవ్రంగా శ్రమిస్తోంది.