ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గారితో జూబ్లీహిల్స్ నివాసంలో భేటీ అయిన ఉబెర్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ (CEO) దారా ఖోస్రోషాహి.

భారత్ న్యూస్ హైదరాబాద్…ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గారితో జూబ్లీహిల్స్ నివాసంలో భేటీ అయిన ఉబెర్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ (CEO) దారా ఖోస్రోషాహి.

Ammiraju Udaya Shankar.sharma News Editor…స‌మావేశంలో పాల్గొన్న ఉబెర్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ (CBO) మధు కన్నన్, ఉబెర్ ఇండియా & సౌత్ ఆసియా ప్రెసిడెంట్ ప్రభ్‌జీత్ సింగ్ , చీఫ్ టెక్నాల‌జీ ఆఫీస‌ర్ ప్ర‌వీణ్ నిప్పల్లి నాగ , సీఎం ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి అజిత్ రెడ్డి

ఉబేర్ విస్త‌ర‌ణ‌కు రాష్ట్ర ప్ర‌భుత్వంతో క‌లిసి ముందుకు సాగుతామ‌ని తెలిపిన సీఇవో ఖోస్రోషాహి.

హైద‌రాబాద్ లో ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను విస్త‌రిస్తున్న‌ట్లు ముఖ్య‌మంత్రికి తెలిపిన ఉబేర్ సీఇవో .

అమెరికా వెలుప‌ల ఏర్పాటు చేసిన ఈ మొద‌టి సెంట‌ర్ లో 600 మంది ఇంజ‌నీర్లు పనిచేస్తున్నార‌ని వివ‌రించిన‌ సీఇవో.

భార‌త్ ఫ్యూచ‌ర్ సీటీలో ఉబెర్ కార్పొరేట్ ఆఫీస్ నిర్మాణానికి ఆస‌క్తి చూపించిన ఉబెర్ సంస్థ‌.

పార్కింగ్ వ్యాపారంలోకి వ‌చ్చే అంశాన్ని ప‌రిశీలించాల‌ని ఉబెర్ సీఇవో కి సూచించిన ముఖ్య‌మంత్రి.

దేశంలోని ప్ర‌ముఖ న‌గ‌రాల్లో పార్కింగ్ స‌మ‌స్య‌ను ఉబెర్ ప్ర‌తినిధుల దృష్టికి తీసుకువ‌చ్చిన సీఎం..

భ‌విష్య‌త్తు అవ‌స‌రాల దృష్ట్యా మ‌ల్టీ లెవ‌ల్ పార్కింగ్ సెంట‌ర్లు ఏర్పాటు చేస్తే బాగుంటుంద‌ని సూచ‌న‌.

ముఖ్య‌మంత్రి సూచ‌న పైన స‌మ‌గ్ర అధ్య‌య‌నం చేస్తామ‌ని చెప్పిన ఉబెర్ ప్ర‌తినిధులు.

వ్యాపార విస్త‌ర‌ణ‌కు అన్ని విధాలుగా రాష్ట్ర ప్ర‌భుత్వం స‌హ‌క‌రిస్తుంద‌ని ఉబెర్ ప్ర‌తినిధుల‌కు హామీ ఇచ్చిన సీఎం.