కైలాసగిరిపై ఏర్పాటు చేసిన 65 అడుగుల భారీ త్రిశూలం

భారత్ న్యూస్ తిరుపతి…కైలాసగిరిపై ఏర్పాటు చేసిన 65 అడుగుల భారీ త్రిశూలం విద్యుత్ వెలుగుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రాత్రివేళల్లో మెరిసిపోతున్న త్రిశూలాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో సందర్శకులు చేరుకుంటున్నారు.

ఆధ్యాత్మికతతో పాటు ఆధునిక లైటింగ్ కలయికగా ఈ త్రిశూలం కనిపిస్తోంది. కైలాసగిరి పర్యాటక ప్రాంతానికి ఇది కొత్త అందాన్ని తీసుకొచ్చిందని స్థానికులు చెబుతున్నారు.

వెలుగులతో మెరిసే ఈ భారీ త్రిశూలం ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.