భారత్ న్యూస్ రాజమండ్రి…సీజ్ చేసిన వాహనాలకు ఈ నెల 29న బహిరంగ వేలం..
పల్నాడు జిల్లా రవాణా శాఖ అధికారి..
పల్నాడు: రికార్డులు సరిగా లేని మరియు పన్నులు చెల్లించకుండా నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతూ రవాణా శాఖ అధికారులకు పట్టుబడిన వాహనాలకు ఈ నెల 29వ తేదీన బహిరంగ వేలంనిర్వహించనున్నట్లు పల్నాడు జిల్లా రవాణా శాఖ అధికారి (DTO) బి. సంజీవ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
ముఖ్య సమాచారం..
వేలం జరుగు తేదీ: మే 29, 2026.
వేలం వేదిక: జిల్లా రవాణా అధికారి కార్యాలయం, పల్నాడు జిల్లా.
వాహనాల వివరాలు..

ప్రస్తుతం నరసరావుపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ల మరియు మాచర్ల ఆర్టీసీ డిపోలతో పాటు పెదకూరపాడు పోలీస్ స్టేషన్లో మొత్తం 14 వాహనాలు సిద్ధంగా ఉన్నాయి.ఆటో రిక్షాలు: 02,ట్రాక్టర్ ప్యాడీ క్లీనర్ వాహనాలు: 08,మ్యాక్సీ క్యాబ్స్: 04 వాహన యజమానులకు చివరి అవకాశం సీజ్ చేయబడిన వాహనాల యజమానులు ఎవరైనా ఉంటే,వారు తమ వాహనాలకు సంబంధించి చెల్లించాల్సిన పన్నులు మరియు జరిమానాలను (Fine) చెల్లించి,మే 15వ తేదీలోపు తమ వాహనాలను విడిపించుకోవాలని అధికారులుసూచించారు.
నిర్దేశించిన గడువులోగా విడిపించుకోని వాహనాలను మే 29న జిల్లా రవాణా కార్యాలయం వద్ద బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఆసక్తి కలిగిన వారు ఈ వేలంలో పాల్గొనవచ్చు.