చిలకలపూడి సీఐగా బాధ్యతలు నిర్వహిస్తున్న అబ్దుల్ నబీ కుమారుడి సాంప్రదాయ కార్యక్రమం ఆదివారం నగరంలోని గోల్డ్ కన్వెన్షన్ హాల్లో వైభవంగా జరిగింది.

భారత్ న్యూస్ విజయవాడ…మచిలీపట్నం
కృష్ణా జిల్లా పోలీసు విభాగంలో చిలకలపూడి సీఐగా బాధ్యతలు నిర్వహిస్తున్న అబ్దుల్ నబీ కుమారుడి సాంప్రదాయ కార్యక్రమం ఆదివారం నగరంలోని గోల్డ్ కన్వెన్షన్ హాల్లో వైభవంగా జరిగింది.

ఈ వేడుకకు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హాజరై కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, ఆత్మీయులు, స్నేహితులు పాల్గొని సందడి చేశారు.

ఆనందోత్సాహాల మధ్య సాగిన ఈ కార్యక్రమంలో అతిథులకు ప్రత్యేక విందు ఏర్పాటు చేసి ఆతిథ్యమిచ్చారు.