భారత్ న్యూస్ హైదరాబాద్…హైదరాబాద్:మే 11
కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది, ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,తీవ్రంగా స్పందిం చారు. ఫోక్సోకేసు పై సమగ్ర విచారణ కోసం ప్రత్యేక టీం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి, పోలీస్ అధికారులను ఆదేశించారు.

Ammiraju Udaya Shankar.sharma News Editor…బాధితురాలి ఫిర్యాదు మేరకు కేంద్రమంత్రి కుమారుడిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ నెల 8వ తేదీనే బాధితురాలి తల్లి నుంచి ఫిర్యాదు అందినప్పటికీ, ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సీవీ ఆనంద్‌ను ముఖ్యమంత్రి ప్రశ్నించారు.
ఈ కేసులో తాత్సారం చేయడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. చట్టం ముందు అందరూ సమానమే నని, ఇలాంటి సున్ని తమైన కేసుల్లో నిర్ల క్ష్యం వహించకూడదని స్పష్టం చేశారు. ముఖ్య మంత్రి ప్రశ్నలకు స్పందించిన డీజీపీ, గత కొన్ని రోజులుగా ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లలో పోలీసు యంత్రాంగం నిమగ్నమై ఉందని వివరించారు.
భద్రతా కారణాల దృష్ట్యా సిబ్బంది అందరూ ఆ విధుల్లో బిజీగా ఉండటం వల్లే ప్రాథమిక విచారణలో కొంత జాప్యం జరిగిందని తెలిపారు. అయితే ప్రస్తుతం కేసు నమోదు చేశామని, పూర్తి వివరాలను సేకరిస్తున్నామని సీఎంకు నివేదించారు.
ప్రత్యేక బృందాల ఏర్పాటు!

ఈ కేసును అత్యంత ప్రాధాన్యతతో స్వీకరించాలని రేవంత్ రెడ్డి, ఆదేశించినట్లు తెలుస్తుంది, బాధిత బాలికకు న్యాయం జరిగేలా చూడాలని, ఇందు కోసం ప్రత్యేక విచారణ బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో సాక్ష్యాలను సేకరించి, నివేదికను త్వరగా సమర్పించా లని, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పక్షపాతంగా దర్యాప్తు సాగాలని స్పష్టం చేశారు.