భారత్ న్యూస్ గుంటూరు..ఈ నెల 11 నుంచి జూన్ 12 వరకు హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు.
మరోవైపు డివిజన్ బెంచ్ కేసుల విచారణ పూర్తయ్యాక న్యాయమూర్తులు సింగిల్ బెంచ్ విధులనూ నిర్వహిస్తారు.
జూన్ 15న పూర్తిస్థాయిలో కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కానున్నాయి.
సెలవుల్లో అత్యవసర కేసుల విచారణకు వెకేషన్ బెంచ్‌లు ఏర్పాటు చేస్తూ రిజిస్ట్రార్ జనరల్ పార్థసారథి ఉత్తర్వులిచ్చారు.
మొదటి దశలో మే 14, 21, 28 తేదీల్లో విచారణలు ఉంటాయి. హైకోర్టు న్యాయమూర్తులు డాక్టర్ జస్టిస్ వై.లక్ష్మణరావు, జస్టిస్ మెడమల్లి బాలాజీ డివిజన్ బెంచ్ గా , జస్టిస్ తుహినకుమార్ సింగిల్ బెంచ్ గా విచారణ చేపడతారు.

రెండో దశలో జూన్ 4, 11 తేదీల్లో విచారణలు జరగనున్నాయి. జస్టిస్ కె.సురేష్ రెడ్డి, జస్టిస్ హరిహరనాథ శర్మ డివిజన్ బెంచ్ గా, జస్టిస్ ఎస్.సుబ్బారెడ్డి సింగిల్ బెంచ్ లో కేసులను విచారిస్తారు.