క్రీడలను ప్రోత్సహించేందుకు అనువైన సౌకర్యాల కల్పనకు కృషి.-ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్

భారత్ న్యూస్ రాజమండ్రి…క్రీడలను ప్రోత్సహించేందుకు అనువైన సౌకర్యాల కల్పనకు కృషి

-ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్

చల్లపల్లి: క్రీడలను ప్రోత్సహించేందుకు అనువైన సౌకర్యాల కల్పనకు తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. ఆదివారం చల్లపల్లిలోని ప్రభుత్వ కార్యాలయాల వెనుక స్థలంలో ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, దివిసీమ గాంధీ స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలు పురస్కరించుకొని స్వర్గీయ సజ్జా రామకోటయ్య, స్వర్గీయ సజ్జా రాజేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామ ప్రముఖులు సజ్జా చలపతిరావు పర్యవేక్షణలో యువతకు క్రికెట్, షటిల్ పోటీలు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ ముఖ్య అతిధులుగా విచ్చేసి పోటీలు ప్రారంభించారు. ఎంవీ కృష్ణారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల వెనుక వృధాగా ఉన్న విశాలమైన స్థలాన్ని అభివృద్ధి చేసి వినియోగంలోకి తెచ్చిన సజ్జా చలపతిరావును, స్వచ్ఛ సుందర చల్లపల్లి కన్వీనర్లు డాక్టర్ డీ.ఆర్.కే.ప్రసాద్ – డాక్టర్ తరిగోపుల పద్మావతి, స్వచ్ఛ కార్యకర్తలను అభినందించారు. క్రీడల నిర్వహణకు అనువుగా ఉన్న ఈ స్థలంలో ప్రభుత్వ సహకారంతో తగిన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. వేసవిలో యువత క్రీడల పట్ల ఆసక్తి చూపటం శుభ పరిణామం అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు క్రీడలకు విశేష ప్రోత్సాహం అందిస్తారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మండల కేంద్రాల్లో క్రీడా సౌకర్యాలు కల్పిస్తే యువతకు మంచి ప్రోత్సాహం లభిస్తుందన్నారు. నగరీకరణ దుష్ఫలితాల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని తెలిపారు. గ్రామీణ యువతను ప్రోత్సహించేందుకు చల్లపల్లిలో క్రీడల అభివృద్ధికి ప్రోత్సాహం అందిస్తానన్నారు.

ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ మాట్లాడుతూ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి సందర్భంగా వారి ఖ్యాతి స్మరించుకున్నారు. క్రీడా పోటీలు ఏర్పాటు చేసిన చలపతిరావును అభినందించారు.

మాజీ ఎంపీపీ, సొసైటీ చైర్మన్ యార్లగడ్డ సోమశేఖర ప్రసాద్ (లంకబాబు), స్వచ్ఛ సుందర చల్లపల్లి కన్వీనర్ డాక్టర్ డీఆర్.కే.ప్రసాద్ ప్రసంగించారు. పోటీలను నిర్వాహకులు గ్రామ ప్రముఖులు సజ్జా చలపతిరావు, మాజీ సర్పంచులు సజ్జా వెంకటేశ్వరరావు, పైడిపాముల కృష్ణకుమారి, మాజీ ఎంపీటీసీ కొడాలి మురళీ, టీడీపీ నేత రావి చిట్టి, క్రికెట్ ప్లేయర్స్ కొక్కిలిగడ్డ నవీన్, కొడాలి బాబూరావు, కొడాలి ఏలీయా, పినిశెట్టి నిరంజన్, డేవిడ్, బెల్లంకొండ అర్జునరావు (చిలక) పర్యవేక్షించారు.

క్రికెట్ కిట్స్ బహుకరణ
ఈ సందర్భంగా సజ్జా రామకోటయ్య, సజ్జా రాజేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ క్రీడాకారులకు రూ.లక్ష వ్యయంతో ఇరవై క్రికెట్ జట్టులకు క్రికెట్ కిట్స్ అతిధుల చేతులమీదుగా అందచేశారు. క్రికెట్ టోర్నమెంట్ బహుమతుల దాతలు టీడీపీ యువ నాయకులు గుత్తికొండ కళ్యాణ్, రావెళ్ల ఫౌండేషన్ ప్రెసిడెంట్ రావెళ్ల ఉదయ్ కుమార్, జనసేన నాయకులు అడపా రాంబాబు, షటిల్ టోర్నమెంట్ బహుమతి దాతలు ఎంవీ ట్రేడర్స్, శారదా గ్రాండియర్ నిర్వాహకులు మాలెంపాటి రంగారావులను అభినందించారు.

కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ తోట కనకదుర్గ, డీసీ చైర్మన్ నిడమానూరు దిలీప్ కుమార్, ఎంపీపీ కోట విజయ రాధిక, జనసేన జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు, టీడీపీ చల్లపల్లి, అవనిగడ్డ మండలాల అధ్యక్షులు మోర్ల రాంబాబు, యాసం చిట్టిబాబు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు వేములపల్లి శ్రీహరి, వైస్ ఎంపీపీ పిట్టి వెంకటేశ్వరమ్మ, ఎంపీటీసీలు మాలెంపాటి శ్రీనివాసరావు, పైడిపాముల స్వప్న, మట్టా కోమలి, పీఏసీఎస్ చైర్మన్లు బొందలపాటి వీరబాబు, గుత్తికొండ వంశీకృష్ణ, స్వచ్ఛ ఏపీ డైరెక్టర్ బోలెం నాగమణి, నీటి సంఘ అధ్యక్షులు గొరిపర్తి సుబ్బారావు, నాయకులు గుడివాక శివరావు, మోర్ల శివ, అనుమకొండ పూర్ణచంద్రరావు, బుల్లా కిషోర్, వరదా హరిగోపాల్, ఉరిమి మణికాంత్, అడపా గురవయ్య, యడ్లపల్లి బుజ్జి, మిరియాల జితేంద్ర, కనకమేడల వాసు, మడమల రంజిత్, గంగిశెట్టి బాబూ రాజేంద్ర, స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.