కాళాష్టమి, మాస శ్రీ కృష్ణ జన్మాష్టమి 🚩

భారత్ న్యూస్ తిరుపతి…కాళాష్టమి, మాస శ్రీ కృష్ణ జన్మాష్టమి 🚩

శనివారం గ్రహబలం పంచాంగం

శనివారం గ్రహాధిపతి “శనైశ్చరుడు” మరియు “రాహువు”.

శనైశ్చరుని అధిష్టాన దైవం “శ్రీ బ్రహ్మ దేవుడు”, మరియు “శ్రీ యమధర్మ రాజు”. శనైశ్చరుని అనుగ్రహం కొరకు శనివారం నాడు స్మరించవలసిన మంత్రాలు:

  1. ఓం శనైశ్చరాయ నమః ||
  2. ఓం బ్రహ్మణే నమః ||
  3. ఓం యమాయ నమః ||
  4. ఓం విష్ణవే నమః ||

శనైశ్చరుని అనుగ్రహం కొరకు శనివారాల్లో శ్రీ మహా విష్ణు ఆలయాన్ని, శ్రీ హనుమాన్ ఆలయాన్ని, సందర్శించండి. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం, శ్రీ హనుమాన్ చాలీసా పఠించండి.

రాహువు యొక్క అధిష్టాన దైవం శ్రీ దుర్గా దేవి, మరియు నాగ (సర్ప) దేవతలు. రాహువు అనుగ్రహం కొరకు శనివారం నాడు స్మరించవలసిన మంత్రాలు:

  1. ఓం రాహవే నమః ||
  2. ఓం దుం దుర్గాయై నమః ||
  3. ఓం సర్పేభ్యో నమః ||

రాహువు యొక్క అనుగ్రహం కొరకు శనివారాల్లో శ్రీ దుర్గ మాత ఆలయాలను రాహుకాలంలో (ఉదయం 9.00 నుండి 10.30 మధ్య) సందర్శించండి. శ్రీ దుర్గ సప్త శ్లోకి స్తోత్రం, శ్రీ దుర్గ సూక్తం పఠించండి.

శనివారం వికలాంగులకు, పెద్దలకు సేవ మరియు దాతృత్వం చేయాల్సిన రోజు. ఇనుము, భూమి, వ్యవసాయం, గృహ నిర్మాణం, యోగా, ధ్యానానికి సంబంధించిన పనులు చేయండి. ముఖ్యమైన పనులు ప్రారంభించకూడదు. ఇతరులను నిందించడం, జుట్టు మరియు గోళ్లు కత్తిరించడం వంటివి చేయకండి.

గ్రహ బలం కొరకు, శనివారం నలుపు, ముదురు నీలం మరియు ఇతర ముదురు రంగు దుస్తులు ధరించండి. శనివారం తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేస్తే, ఆయుష్షు పెరుగుతుంది, కుటుంబ సౌఖ్యం కలుగుతుంది, వస్తు వాహనాలు లభిస్తుంది, ప్రతి పనిలో శుభం చేకూరుతుంది.

అమృత కాలం:
12:23 PM – 02:08 PM

దుర్ముహూర్తం:
07:36 AM – 08:28 AM

వర్జ్యం:
03:38 AM – 05:20 AM

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

శ్రీ పరాభవ నామ సంవత్సరం, వైశాఖ మాసం, కృష్ణ పక్షం,

తిథి:
సప్తమి: May 08 12:22 PM to May 09 02:03 PM
అష్టమి: May 09 02:03 PM to May 10 03:06 PM

సప్తమి ఏదైనా కొత్త పనిని ప్రారంభించేందుకు అనుకూలమైన భద్ర తిథి. సప్తమి రవాణా కార్యకలాపాలు, ప్రయాణాలు, వివాహ ప్రయత్నాలు, సంగీతం, నృత్యం, చర్చ, అలంకరణ, ఆభరణాల కొనుగోలు, మరియు శారీరక వ్యాయామం ప్రారంభించడం వంటి పనులకు అనుకూలమైన తిథి.

సప్తమి తిథి, శ్రీ రామ, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలు, మరియు శివాలయాలు సందర్శించడానికి, శ్రీ సూర్య భగవానుడి ఆరాధనకు, ఆదిత్య హృదయ స్తోత్రం మరియు సూర్యుని మంత్రాలు పఠించడానికి అత్యంత శుభప్రదమైన రోజు.

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

నక్షత్రం:
శ్రవణ: May 08 09:19 PM to May 09 11:24 PM
ధనిష్ఠ: May 09 11:24 PM to May 11 12:49 AM

శ్రవణా నక్షత్రానికి అధిపతి “చంద్రుడు”. అధిష్టాన దేవత “విష్ణు”. ఇది తాత్కాలిక, శీఘ్ర మరియు కదిలే స్వభావం గల నక్షత్రం.

శ్రవణా నక్షత్రం ఉన్నరోజు స్మరించవలసిన మంత్రాలు:

  1. ఓం సోమాయ నమః ||
  2. ఓం విష్ణవే నమః ||

శ్రవణా నక్షత్రం ఉన్నరోజు – ప్రయాణాలు, రవాణా, తోటపని, ఊరేగింపులకు వెళ్లడం, స్నేహితులను సందర్శించడం, షాపింగ్ చేయడం మరియు తాత్కాలిక స్వభావం కలిగిన దేనికైనా అనుకూలం

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

మీకు సాధ్యమైనప్పుడల్లా అనాధలకు, జంతువులకు, పక్షులకు ఆహారాన్ని, త్రాగు నీటిని అందించండి. ఇలా చేయడం వలన లభించే పుణ్య బలం తో జాతక రీత్యా మీరు అనుభవించాల్సిన ఎన్నో కష్టాలు మీకు తెలియకుండానే తొలగిపోతుంది.

చెట్లను నాటి, వాటిని సంరక్షించడాన్ని శివ పురాణం “స్థావర లింగ పూజ” గా వర్ణించింది. కాబట్టి మీరు చెట్లను నాటి వాటిని సంరక్షించారంటే, పర్యావరణాన్ని కాపాడడం తో పాటు విశేష దైవానుగ్రహాన్ని కూడా పొందవచ్చు.

లోకాః సమస్తాః సుఖినో భవంతు ||

శుభం భూయాత్ ||

🙏