భారత్ న్యూస్ హైదరాబాద్…శ్రీతేజ్ ఇంటికి అల్లు అరవింద్, అల్లు స్నేహా
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, అల్లు స్నేహారెడ్డి పుష్ప 2 మూవీ సమయంలో గాయపడ్డ బాలుడు శ్రీతేజ్ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా శ్రీతేజ్ కుటుంబ సభ్యులతో వారు ఆప్యాయంగా గడిపారు. తమ వంతు భరోసా కల్పిస్తూ, ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వారి రాక ఆ కుటుంబానికి ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. కాగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో శ్రీతేజ్ అమ్మ చని పోయిన సంగతి తెలిసిందే.
