ప్రాణాపాయం ఉందని తెలిసినా.? ప్రమాదకరంగా విద్యుత్ వైర్లు: పట్టించుకోని విద్యుత్ శాఖ
తిరుపతి జిల్లా పాకాల మండలం
ఇరంగారిపల్లి పంచాయితీ తలారిపల్లె గ్రామంలో కరెంట్ తీగలు చేతికి తగిలేలా రోడ్డుపైన వేలాడుతూ ఉండడంతో గ్రామంలో ప్రజలకు ప్రాణపాయం ఉందని విద్యుత్ శాఖ అధికారులకు అక్కడ విద్యుత్ స్తంభం వేయాలని ఎన్ని సార్లు చెప్పిన కుంటి సాకులతో కాలయపన చేస్తున్నారని ఆరోపించారు.గ్రామంలో దీనివల్ల ప్రమాదం జరిగితే అధికారులు పూర్తి బాధ్యత వహించవలసి వస్తుంది అని హెచ్చరించారు.ప్రమాదం జరగక ముందే సమస్యను పరిష్కరించాలని, ఆలా పరిష్కరించకపోతే విద్యుత్ శాఖ సీఎండీ దృష్టికి తీసుకెళ్తామని బహుజన్ సమాజ్ పార్టీ చంద్రగిరి అసెంబ్లీ అధ్యక్షులు జయదేవ్ తెలిపారు
