మాస్క్‌లు వేసుకుని.. భారత్ నౌకను ఎలా స్వాధీనం చేసుకున్నారో చూడండి..

భారత్ న్యూస్ ఢిల్లీ…..మాస్క్‌లు వేసుకుని.. భారత్ నౌకను ఎలా స్వాధీనం చేసుకున్నారో చూడండి..

పర్షియన్ గల్ఫ్‌లో కీలక సముద్ర మార్గమైన హోర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమయ్యాయి. ఇరాన్ నౌకాదళానికి చెందిన సైనికులు భారతదేశానికి వెళ్తున్న ఓ వాణిజ్య నౌకను స్వాధీనం చేసుకున్న ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఆ ఘటనకు సంబంధించిన వీడియోను తాజాగా ఇరాన్ టెలివిజన్ ఛానెల్ ప్రసారం చేసింది.

ముసుగులు ధరించిన కమాండోలు ఆ నౌకలను వెంబడించి, వాటిని ఎలా స్వాధీనం చేసుకున్నారో చూపిస్తున్న ఒక వీడియోను ఇరాన్ విడుదల చేసింది.ఆ వీడియో చూడడానికి ఓ హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది.

ఈ ఘటనలో రెండు నౌకలను ఇరాన్ స్వాధీనం చేసుకుంది. వాటిలో ఒకటి భారతదేశం లోని గుజరాత్ వైపు ప్రయాణిస్తున్న నౌక అని వార్తలు వస్తున్నాయి. ఆ నౌకలు నిబంధనలను ఉల్లంఘించాయని, నావిగేషన్ సిస్టమ్‌లను మార్చి ప్రయాణించేందుకు ప్రయత్నించాయని ఇరాన్ అధికారులు ఆరోపిస్తున్నారు…