..భారత్ న్యూస్ అమరావతి..డ్వాక్రా నిధుల గోల్మాల్.. ఆరుగురు అరెస్ట్
అమరావతి మహిళా సమాఖ్యలో 2018 నుంచి 2023 వరకు డ్వాక్రా నిధుల దుర్వినియోగం జరిగినట్లు సీఐ అచ్చయ్య వెల్లడించారు. డ్వాక్రా ప్రాజెక్టు డైరెక్టర్ ఫిర్యాదుతో విచారణ చేపట్టగా, సుమారు రూ.64.75 లక్షల అక్రమాలు బయటపడ్డాయి. ఈ కేసులో ప్రమేయం ఉన్న ఆరుగురు నిందితులను ధరణికోటలో అదుపులోకి తీసుకుని, సత్తెనపల్లి కోర్టులో హాజరుపరిచారు. తదుపరి విచారణ కొనసాగుతోంది.
