పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలి

భారత్ న్యూస్ రాజమండ్రి…పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలి

మోపిదేవి సుబ్రహ్మణ్య క్షేత్రంలో, అవనిగడ్డ రాజశేఖరస్వామి దేవస్థానంలో డిప్యూటీ సీఎం ఆరోగ్యం కోసం మండలి వెంకట్రామ్ పూజలు

అవనిగడ్డ: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ ఆకాంక్ష వ్యక్తం చేశారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పిలుపు మేరకు మండలి వెంకట్రామ్ ఆధ్వర్యంలో అవనిగడ్డ నియోజకవర్గంలోని ప్రముఖ దేవాలయాల్లో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పూజలు చేశారు. ఆదివారం అవనిగడ్డలోని శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ రాజశేఖరస్వామి వారి దేవస్థానంలో, మోపిదేవిలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో డిప్యూటీ సీఎం ఆరోగ్యం కోసం మండలి వెంకట్రామ్ పూజలు చేశారు. ఆయా కార్యక్రమాలకు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. జనసైనికులతో పాటు టీడీపీ, బీజేపీ శ్రేణులు పూజలలో పాల్గొన్నారు.

ఆయా కార్యక్రమాల్లో జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్, పార్టీ రాష్ట్ర మత్స్యకార విభాగం కార్యదర్శి లంకె యుగంధర్, సీనియర్ నాయకులు బచ్చు వెంకట్ నాధ్ ప్రసాద్, ఘంటసాల ఏఎంసీ చైర్మన్ తోట కనకదుర్గ, జనసేన పార్టీ మోపిదేవి మండల పార్టీ అధ్యక్షుడు పూషడపు రత్నగోపాల్, అవనిగడ్డ మండల ఉపాధ్యక్షులు తుంగల నరేష్, మండల ప్రధాన కార్యదర్శి మండలి శివప్రసాద్, జిల్లా కర్రసాము అసోసియేషన్ అధ్యక్షులు సింహాద్రి పవన్, బీజేపీ మండల అధ్యక్షుడు సనకా ప్రశాంత్, ఎంపీటీసీ సభ్యులు బొప్పన భాను, కటికల వసంత్, సనకా వెంకట రాజేష్ బాబు, ఏఎంసీ వైస్ చైర్మన్ రాజనాల వీరబాబు, పీఏసీఎస్ చైర్మన్లు యలవర్తి చిన్నా, యర్రంశెట్టి సుబ్బారావు, ఆసుపత్రి డైరెక్టర్ బచ్చు కృష్ణకుమారి, లంకమ్మ దేవస్థానం మాజీ అధ్యక్షులు అన్నపరెడ్డి రామదాస్, నీటి సంఘం అధ్యక్షులు రేపల్లె రవీంద్ర, కే.కొత్తపాలెం గ్రామ పార్టీ అధ్యక్షులు మత్తి వంశీకృష్ణ, దేవస్థానం డైరెక్టర్లు కోసూరు అవినాష్, అన్నపరెడ్డి వెంకటేశ్వరమ్మ, నాయకులు సిద్దినేని అశోక్ నాయుడు, బాదర్ల లోలాక్షు నాయుడు, కోసూరు శివాజీ, కమతం నరేష్, తుంగల లక్ష్మి, అరజా కిరణ్ కాంత్, యడ్లపల్లి బుజ్జి, కూరేటి రాఘవ, కూరేటి జగన్, కమ్మిలి సాయిభార్గవ, మండలి శివప్రసాద్, గంగిశెట్టి బాబు రాజేంద్ర, కోసూరు నాగమల్లేశ్వరరావు, భోగిరెడ్డి బుజ్జిబాబు, డోకిపర్తి బాల కోటేశ్వరరావు, గుగ్గిలం అనీల్ తదితరులు పాల్గొన్నారు.