భారత్ న్యూస్ రాజమండ్రి…తెలంగాణలోని నెట్టంపాడు ప్రాజెక్టుకు ఇప్పటికీ అనుమతులు లేవు. వైయస్ జగన్ కూడా పాత ప్రాజెక్టులకు నీళ్లు ఇచ్చేందుకు రూ.900 కోట్లతో సీమ ఎత్తిపోతలను 90 శాతం పూర్తి చేశారు. వెలుగొండ నేనే పునాది వేశా..పూర్తి చేశానని చంద్రబాబు చెప్పడంతో ప్రజలు నవ్వుకుంటున్నారు. దాన్ని పూర్తి చేసింది వైయస్ జగన్. మరో రూ.500 కోట్లు ఖర్చు చేస్తే నీరు పారుతుంది. నీటి కష్టాలు ఎక్కువవుతున్నాయి. ప్రజల కన్నీళ్లలో చంద్రబాబు కొట్టుకుపోతారు. రాయలసీమ ప్రజలు నిన్ను నిలదీస్తారు. తక్షణమే రాయలసీమను పూర్తి చేయాలి. కర్నాటక, తెలంగాణ ప్రాజెక్టులను ఆపండి. పోలవరం ఎత్తు పెంచండి.

-సాకే శైలజానాథ్ గారు, శింగనమల వైయస్ఆర్ సీపీ ఇంఛార్జ్