భారత్ న్యూస్ శ్రీకాకుళం….అనుకున్నదొక్కటి.. అయిందొక్కటి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో రీజినల్ రింగ్ రోడ్డు కాస్త సాధారణ హైవేగా మార్పు
ట్రిపుల్ ఆర్ డిజైన్‌లో భారీ మార్పులు.. ఇది ఇప్పుడు కేవలం హైవేనే
భారీ వ్యయం వల్ల, ప్రత్యేకతలను తొలగించి సాధారణ హైవేగా మార్పు
తొలుత దేశంలోనే 8 లైన్లతో కూడిన అతి పొడవైన రింగ్ రోడ్డుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన
దేశంలో మరో 20 ఏళ్ల వరకు రోడ్డు ట్రాఫిక్ కి 8 లైన్లు అవసరం లేదని 6 లైన్లకు కుదించిన కేంద్ర ప్రభుత్వం
తొలుత ORR పొడవునా ఎలక్ట్రిక్ లైట్స్ ఉన్నట్లు, ట్రిపుల్ ఆర్ పొడవునా LED స్ట్రీట్ లైటింగ్ వ్యవస్థ ప్రతిపాదన
ఇప్పుడు LED స్ట్రీట్ లైటింగ్ ఏర్పాటు భారీ ఖర్చుతో కూడుకున్నది అని కేవలం గ్రామాలు తగిలే ప్రాంతాల్లో మాత్రమే లైట్లు ఏర్పాటు
తొలుత ORR తరహాలో ట్రిపుల్ ఆర్కు కూడా సర్వీస్ రోడ్డును ప్రతిపాదన

ఇప్పుడు కనీసం కచ్చా రోడ్డు యాక్సెస్ కూడా లేకుండా కేవలం ఖాళీ స్థలం మాత్రమే ఉండేట్లు ఆమోదం
తొలుత ట్రిపుల్ ఆర్‌పై గరిష్ట వేగం గంటకు 120-130 కిలోమీటర్లు
ఇప్పుడు గరిష్ట వేగం తగ్గించి గంటకు 100 కిలోమీటర్లు మాత్రమే
తొలుత ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగంలోనే మొత్తం 204 వంతెనలు నిర్మించాలని ప్రతిపాదన.. ఇందులో మూసీ నది మీద, మంజీరా నది మీద, హరిద్ర నది మీద, పలు వాగులు వంకల మీద వంతెనలు, కల్వర్టులు నిర్మించాలని ప్రతిపాదన
ఇప్పుడు వంతెనల వ్యయం భారీగా ఉండటంతో సగానికి సగం కుదింపు
రోడ్డు నిలువు వాలు (వర్టికల్ కర్వ్) 1300 మీటర్లు ఉండేలా డిజైన్.. అంటే 600 మీటర్ల దూరంలో పిల్లి సైజు జంతువు రోడ్డు దాటుతున్నా కనిపిస్తుంది. ముందే అప్రమత్తమై వేగాన్ని నియంత్రించే వీలు ఉండేలా
కానీ ఇప్పుడు రోడ్డు నిలువు వాలు 650 మీటర్లకు కుదింపు.. అంటే కేవలం 360 మీటర్లు మాత్రమే విజిబిలిటీ. వాహనాలు ఒకవేళ పరిమితికి మించిన వేగంతో దూసుకెళ్తే ప్రమాదాలకు ఆస్కారం