భారత్ న్యూస్ శ్రీకాకుళం….ఏపీలో రేషన్ షాపుల్లో మళ్ళీ కిరోసిన్ పంపిణీ
ఏపీలో వచ్చే సోమవారం నుంచి లీటరు చొప్పున కిరోసిన్ పంపిణీ


హార్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతల ప్రభావంతో విశాఖపట్నానికి ఈ నెల 21వ తేదిన రావాల్సిన గ్యాస్ నౌక 26వ తేదిన చేరనున్నట్టు కేంద్రం సమాచారం ఇచ్చిందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. అప్పటి వరకు సరఫరాలో అంతరాయం లేకుండా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు చర్యలు తీసుకుంటున్నాయని చెప్పారు. ప్రస్తుతం గ్యాస్ కొరత నేపథ్యంలో కేంద్రం కేటాయించిన 2800 కిలో లీటర్ల కిరోసిన్ ను వచ్చే సోమవారం నుంచి రేషన్ ద్వారా గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో లీటరు చొప్పున పంపిణీ చేయనున్నట్టు తెలిపారు.