భారత్ న్యూస్ హైదరాబాద్….ఈ సారి ఒకేసారి 3 నెలల రేషన్ పంపిణీ!
రేషన్ లబ్దిదారులకు కేంద్రం శుభవార్త అందించనున్నట్లు సమాచారం. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన ఉచిత రేషన్ ను ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్రాలకు ఆహార, ప్రజా పంపిణీ శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ మార్చి నెలాఖరులోపు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఎండల తీవ్రతతో పాటు గోదాముల్లో ధాన్యం నిల్వలు అధికంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
