మరో 300 అక్రమ సైట్లు, ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు బ్లాక్!

భారత్ న్యూస్ విశాఖపట్నం..మరో 300 అక్రమ సైట్లు, ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు బ్లాక్!

దేశంలో అక్రమంగా కొనసాగుతున్న 300 ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వెబ్సైట్లు, యాప్లను కేంద్ర ప్రభుత్వం తాజాగా బ్లాక్ చేసింది. వీటిలో ఆన్లైన్ క్యాసినోలు, మట్కా నెట్వర్క్లు ఉన్నాయి. దీంతో ఇప్పటివరకు నిషేధించిన యాప్ల సంఖ్య 8,400కి చేరింది. ‘ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్, 2025’ ప్రకారం అక్రమ రమ్మీ, పోకర్ వంటి గేమ్లు నిర్వహిస్తే 3 ఏళ్ల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించింది.