ఎల్లంపల్లెలో గజరాజులు.. భయాందోళనతో గ్రామస్తులు

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఎల్లంపల్లెలో గజరాజులు.. భయాందోళనతో గ్రామస్తులు

తిరుపతి చంద్రగిరి మండలం ఎల్లంపల్లెలో ఏనుగుల మంద కలకలం రేపింది. రాత్రి వేళల్లో పంట పొలాలపై ఏనుగులు విరుచుకుపడుతున్నాయి. ఏనుగులను అడవిలోకి మళ్లించేందుకు ఫారెస్ట్‌ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు..