పాకాల పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ కాపర్ కేబుల్ వైర్ల దొంగతనాల గ్యాంగ్ అరెస్టు:చోరీ సొత్తు స్వాధీనం

పాకాల పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ కాపర్ కేబుల్ వైర్ల దొంగతనాల గ్యాంగ్ అరెస్టు:చోరీ సొత్తు స్వాధీనం

పాకాల,మార్చి9( భారత్ డిజిటల్ న్యూస్ ) తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల పోలీస్ స్టేషన్ లో పాకాల సి.ఐ టి.చిన్న గోవిందు మీడియా సమావేశం సోమవారం నిర్వహించారు.ఈ సందర్భంగా పాకాల సీఐ మాట్లాడుతూ తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు ఉత్తర్వుల మేరకు చంద్రగిరి SDPO బేతపూడి ప్రసాద్ సూచనలతో పాకాల పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ టి.చిన్న గోవిందు ఆధ్వర్యంలో జిల్లాలో జరుగుతున్న వ్యవసాయ బోరు మోటార్ కాపర్ కేబుల్ వైర్ల దొంగతనాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగింది.ఈ క్రమంలో పాకాల పోలీస్ స్టేషన్ సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సి. తరుణ్ తమ సిబ్బందితో కలిసి ప్రత్యేక గస్తీ నిర్వహించారు.మార్చి 8వ తేదీ తిరుపతి జిల్లా పాకాల మండలం పాకాల రైల్వే అండర్ బ్రిడ్జి సమీపంలో వాహన తనిఖీలు నిర్వహించుచుండగా ఒక ఆటో వద్ద నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు.పోలీసులను గమనించిన వారు ఆటోను అక్కడే వదిలి పారిపోవడానికి ప్రయత్నించగా వెంటాడి పట్టుకున్నారు.వారి వద్ద ఉన్న సంచులను పరిశీలించగా కాపర్ కేబుల్ వైర్లు మరియు దొంగతనాలకు ఉపయోగించే పనిముట్లు లభించాయి.విచారణలో వారు తిరుపతి జిల్లా పరిధిలోని పలు మండలాల్లో వ్యవసాయ బోరు మోటార్లకు అమర్చిన కాపర్ కేబుల్ వైర్లను కత్తిరించి దొంగతనం చేయడం మరియు ఇళ్లలో చోరీలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారు.దర్యాప్తులో భాగంగా మరికొంతమంది సహచరుల వివరాలు బయటపడడంతో మొత్తం 7 మంది నిందితులు ఈ కేసులో ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేయడం జరిగింది.అరెస్ట్ అయిన నిందితులు,నల్లతంబి శ్రీనివాస్ (19)రేణిగుంట,పృధ్విరాజ్ (26), తుమ్మలగుంట / కుర్రకాలువ,నాగపూర్ బలరాం (30)రామకృష్ణాపురం, రేణిగుంట మండలం,దేవరాజ్ మురుగేశ్ (33)రామకృష్ణాపురం, రేణిగుంట మండలం కాగా రిసీవర్లు గంగి శెట్టి,దామినేడు
గడ్డం హరి,రేణిగుంట ప్రాంతం,రాజ్ దేవ్ తిరుచానూరు, నిందితులంతా కలిసి ఒక ఆటో రిక్షా ద్వారా రాత్రి సమయంలో తిరుపతి జిల్లా పరిధిలోని పలు మండలాలకు వెళ్లి వ్యవసాయ బోరు మోటార్లకు అమర్చిన కాపర్ కేబుల్ వైర్లను కత్తిరించి దొంగతనం చేస్తున్నారు.దొంగిలించిన కాపర్ వైర్లను కాల్చి అందులోని రాగిని తీసి తిరుపతి మరియు పరిసర ప్రాంతాల్లోని గుజిరి షాపులకు విక్రయించి వచ్చిన డబ్బును తమ వ్యసనాలకు ఖర్చు చేసుకుంటున్నారు.అలాగే తిరుపతి రూరల్ మండలం మిట్టగాదంకి గ్రామంలో ఒక ఇంటి తలుపు పగలగొట్టి బంగారు నగలు,ల్యాప్‌టాప్,మొబైల్ ఫోన్ మరియు స్మార్ట్ వాచ్ దొంగతనం చేసినట్లు విచారణలో వెల్లడైంది.స్వాధీనం చేసుకున్న చోరీ సొత్తు, సుమారు 2000 మీటర్ల కాపర్ కేబుల్ వైర్లు Dell ల్యాప్‌టాప్ Redmi మొబైల్ ఫోన్ FODG ఫ్యాషన్ స్మార్ట్ వాచ్ బంగారు ఉంగరం 2 గ్రాములు, పిల్లల చెవి మాటీలు 1 జత (1.9 గ్రాములు) కేబుల్ కట్టర్ తాళాలు పగలగొట్టడానికి ఉపయోగించిన ఇనుప రాడ్లు,ఆటో రిక్షా (Bajaj Maxima AP39 US 1797) టీవీ నగదు రూ.1 లక్ష రూపాయలు, మొత్తం స్వాధీనం చేసుకున్న చోరీ సొత్తు విలువ సుమారు 5,30,000 రూపాయలు.నిందితుల పై పాకాల పోలీస్ స్టేషన్‌లో 3 కేసులు,తిరుపతి రూరల్‌లో 2 కేసులు,రామచంద్రపురం పోలీస్ స్టేషన్‌లో 1 కేసు,చంద్రగిరి పోలీస్ స్టేషన్‌లో 1 కేసు నమోదై ఉన్నట్లు గుర్తించారు.ఈ కేసును ఛేదించడంలో చురుకుగా పని చేసిన పాకాల ఇన్స్పెక్టర్ టి.చిన్న గోవిందు,పాకాల సబ్-ఇన్స్పెక్టర్ సి.తరుణ్ మరియు పోలీసు సిబ్బందిని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు అభినందించారు.