భారీగా తగ్గిన బంగారం ధరలు

భారత్ న్యూస్ శ్రీకాకుళం….భారీగా తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో నేడు బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,960 తగ్గి
రూ.1,61,680కు చేరింది. అదేవిధంగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,800 తగ్గి రూ.1,48,200 వద్ద కొనసాగుతోంది. అయితే, వెండి ధరల్లో ఎటువంటి మార్పు కనిపించలేదు. కిలో వెండి ధర స్థిరంగా రూ.2,90,000 వద్దే కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇంచుమించు ఇవే ధరలు అమలవుతున్నాయి…..