గచ్చిబౌలిలో కల్తీ మాఫియా గుట్టురట్టు భారీగా వంట నూనె గోధుమ పిండి సీజ్….

.భారత్ న్యూస్ హైదరాబాద్….గచ్చిబౌలిలో కల్తీ మాఫియా గుట్టురట్టు భారీగా వంట నూనె గోధుమ పిండి సీజ్….

నిత్యావసర వస్తువుల ను కల్తీ చేస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ ఎస్‌ఓటీ (SOT) పోలీసులు….

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్‌లో ఒక గోదాముపై దాడి చేసి, భారీ మొత్తంలో కల్తీ వంట నూనె, గోధుమ పిండిని స్వాధీనం చేసుకున్నారు….

ఈ దాడుల్లో ​5000 లీటర్ల కల్తీ వంట నూనె,​5 టన్నుల కల్తీ గోధుమ పిండి స్వాధీనం చేసుకున్న పోలీసులు….

​ఈ అక్రమ వ్యవహారానికి ప్రధాన కారకులుగా భావిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు….

గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు….