భారత్ న్యూస్ గుంటూరు…చెరువుల్లో కబ్జాలను తొలగించాలి…!
నెల్లిచెరువుతోపాటు జిల్లాలోని చెరువులను రక్షించాల
*ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు పెట్టాలి
పిజిఆర్ఎస్ లో కోరిన ఉత్తరాంధ్ర చెరువులు పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు
పార్వతీపురం:
పార్వతీపురం మన్యం జిల్లాలో చెరువుల్లో జరిగిన కబ్జాలను తొలగించాలని ఉత్తరాంధ్ర చెరువులు పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరిశర్ల మాలతీ కృష్ణమూర్తి నాయుడు కోరారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన జిల్లా రెవెన్యూ అధికారి కే హేమలతతో జిల్లాలో జరుగుతున్న చెరువుల కబ్జాలపై చర్చించారు. నెల్లి చెరువుతోపాటు జిల్లాలోని చెరువులన్నింటిని రక్షించాలన్నారు. పట్టపగలే యదేచుగా చెరువులు కబ్జాకు గురవుతున్నాయన్నారు. హైకోర్టు ఆదేశాలు గౌరవించి జీ వో నెం :386 ప్రకారం వాచ్ డాగ్ కమిటీ సమావేశాలను నిర్వహించి నీటి వనరుల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని కోరారు. గ్రామ పంచాయితీల చెరువులు, ఇతర ప్రభుత్వ భూముల వివరాలను జిల్లా గెజిట్లో పొందుపరిచి జీ వో నెం:188 ను అమలు చేయాలన్నారు.జిల్లాలోని కనుమరుగైపోతున్న చెరువులు, కాలవలు, గెడ్డలు , నదులు మరియు ఇతర ప్రభుత్వ భూముల బౌండరీని ప్రామానికి రికార్డుల ఆధారంగా గుర్తించి అందులో ఆక్రమణలను తొలగించాలన్నారు.500 సంవత్సరాల చరిత్ర కలిగిన చెరువులు మన అసమర్థత, నిర్లక్ష్యం, అవినీతి కారణంగా ఈరోజు భావితరాలకు అందుకుండా చేయడం పశుపక్షాదులతో పాటు, మనిషి మనుగడ ప్రమాదంలో పడుతుందని గుర్తించి తక్షణం యుద్ధ ప్రాతిపదికన చెరువులను పరిరక్షించాల్సిన రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, మున్సిపల్.. అన్ని శాఖలను సమన్వయం చేసుకొని బౌండరీని గుర్తించి చెరువుల్లోని ఆక్రమణలను తొలగించాలన్నారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ వంగల దాలినాయుడు, జిల్లా అధ్యక్షులు వారణాసి శ్రీహరి, జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్క చందర్రావు, బాలు పలువురు పాల్గొన్నారు
