భారత్ న్యూస్ రాజమండ్రి…సాంబార్‌పై గొడవ… మహిళ మృతి
బెంగుళూరులో జరిగిన చిన్న గొడవ పెద్ద విషాదానికి దారితీసింది. సాంబార్ వంటకంపై జరిగిన వాగ్వాదం ఓ మహిళ ప్రాణాలు తీసింది.
బెంగుళూరుకు చెందిన 27 ఏళ్ల కావ్యకు ఐదేళ్ల క్రితం రంగస్వామితో వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల బిడ్డ కూడా ఉన్నాడు. మూడు రోజుల క్రితం చేసిన సాంబార్‌ను ఫ్రిజ్‌లో పెట్టి ప్రతిరోజూ వేడి చేసి పెడుతోందని భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది.
ఈ విషయం పై ఇద్దరి మధ్య తీవ్రంగా గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన కావ్య కోపంతో బాత్రూమ్‌లోకి వెళ్లి పొలాల కోసం తెచ్చి పెట్టిన పురుగుల మందు తాగింది.

కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.