భారత్ న్యూస్ గుంటూరు…పెళ్లి ఒత్తిడి… విధి నిర్వహణలోనే వైద్యురాలి ప్రాణాంతక నిర్ణయం
వృత్తిరీత్యా ఎంతో మందికి ప్రాణదానం చేయాల్సిన ఒక యువ వైద్యురాలు అర్ధాంతరంగా తనువు చాలించడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
ఘటనకు గల కారణాలను పరిశీలిస్తే… కుటుంబ సభ్యులు కుదిర్చిన వివాహం ఆమెకు ఇష్టం లేకపోవడమే ప్రధాన కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. పెళ్లి విషయంలో గత కొద్దిరోజులుగా ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే మనస్తాపానికి గురైన ఆమె విధి నిర్వహణలో ఉంటూనే ప్రాణాంతక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం చంద్రరేఖ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రి ప్రాంగణంలో ఆమె కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. తోటి సిబ్బంది సైతం ఆమె మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు. వైద్యురాలి ఆకస్మిక మృతి స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.