గత సర్పంచ్‌ల పెండింగ్ బిల్లుల చెల్లింపులపై స్పష్టత – మంత్రి సీతక్క ఆదేశాలతో పంచాయతీ రాజ్ శాఖ మార్గదర్శకాలు

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…గత సర్పంచ్‌ల పెండింగ్ బిల్లుల చెల్లింపులపై స్పష్టత – మంత్రి సీతక్క ఆదేశాలతో పంచాయతీ రాజ్ శాఖ మార్గదర్శకాలు

గత సర్పంచ్‌లు చేపట్టిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల చెల్లింపుల విషయంలో మంత్రి సీతక్క ఆదేశాల మేరకు తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ స్పష్టతనిచ్చింది. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారులకు పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్ శాఖ డైరెక్టర్ దివ్యా దేవరాజన్ ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం (15th Finance Commission) కింద 2023-24 ఆర్థిక సంవత్సరానికి గ్రామ పంచాయతీలకు టైడ్ కాంపొనెంట్ క్రింద రూ. 245.00 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. అలాగే 2024-25 ఆర్థిక సంవత్సరానికి బేసిక్ అన్‌టైడ్ మరియు టైడ్ గ్రాంట్స్ కింద రూ. 640.07 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు.

గత సర్పంచ్‌ల పదవీకాలం 01.02.2024తో ముగిసిన నేపథ్యంలో, 2023-24 సంవత్సరానికి విడుదలైన టైడ్ కాంపొనెంట్ నిధులతో చేపట్టిన తాగునీరు, పారిశుధ్య పనులకు సంబంధించిన రికార్డులు అందుబాటులో ఉన్న మేరకు మాత్రమే గ‌త స‌ర్పంచ్ ల‌కు బిల్లులు చెల్లించవచ్చని స్పష్టం చేశారు.

19.02.2026న జారీ చేసిన సర్క్యులర్ నం. CPR&RE-G1/SCHM/XVFC/2/2025 ద్వారా జిల్లాల పంచాయతీ ధ
ికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు గుర్తు చేశారు. 2023-24 టైడ్ కాంపొనెంట్ కింద విడుదలైన నిధులపై గత సర్పంచ్‌ల పెండింగ్ బిల్లులను రికార్డులు సరిచూసి చెల్లించాలని ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.

అదేవిధంగా, గ్రామ పంచాయతీలకు అందుబాటులో ఉన్న నిధుల నుంచి మల్టీ పర్పస్ వర్కర్లు (MPWs) వేతనాలు చెల్లించాలని సూచించారు. ఈ మేరకు జిల్లాల స్థాయిలో తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.