భారత్ న్యూస్ విజయవాడ…2026: శివరాత్రి మరుసటి రోజు హాలీడే.. ఉత్తర్వులు జారీ
శివరాత్రి ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీన ఆదివారం రోజు వచ్చింది.. అయితే, ఆదివారం శివరాత్రి జాగారంలో భక్తులు ఉండడంతో.. మరుసటి రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఆప్షనల్ హాలీడే ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 16న ప్రభుత్వ ఉద్యోగులకు ఆప్షనల్ హాలీడేగా పరిగణించాలని అధికారికంగా నోటిఫికేషన్ విడుదలైంది. మహాశివరాత్రి అనంతరం విశ్రాంతి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. ఇక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయంపై AP JAC Amaravati నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఎపీజేఎసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం రోజున ఆప్షనల్ హాలీడే ఇవ్వడం వల్ల ఉద్యోగులు పండుగను ప్రశాంతంగా జరుపుకునే అవకాశం లభిస్తుందని ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి.
