భారత్ న్యూస్ డిజిటల్:కడప:
హిందూ ధర్మానికి బ్రాహ్మణ జాతి కిద్రోహం చేసింది ఎవరు?
కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత హిందూ ధర్మానికి బ్రాహ్మణ జాతి కి ద్రోహం జరుగుతున్నదని వైసీపీ నాయకులు మల్లాది విష్ణు వెల్లంపల్లి శ్రీనివాస్ లు ఆరోపించడాన్ని ఖండిస్తు నట్లు బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర నాయకులు పీవీయెస్ వి ప్రసాదరావు సూగురు రఘునాథరావు లు ఒక ప్రకటన లో తెలిపారు.వాస్తవానికి గత ప్రభుత్వ హయం లో హిందూ ధర్మానికి బ్రాహ్మణ జాతి కి తీవ్రమైన అన్యాయం చేసారని ఆరోపించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా ఉండి కార్పొరేషన్ నిర్వీర్యం చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు.బ్రాహ్మణ కార్పొరేషన్ కు 1000కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని 2019ఎన్నికల సమయంలో ప్రకటించి అధికారం లోకి వచ్చిన తర్వాత కార్పొరేషన్ ద్వారా వచ్చే అన్ని పథకాలు నిలిపివేసిన ఘనత మీది కాదా అని ప్రశ్నించారు.హిందూ ధర్మం గురించి ఆరోపణలు చేసే మీరు గత ప్రభుత్వం హయాంలో తిరుపతి లడ్డు కల్తీ చేసి హిందూ ధర్మం కు తూట్లు పొడవ లేదా అని ప్రశ్నించారు.దేవాలయల కూల్చి వేత మరిచారా అని అన్నారు. ప్రజలు అన్ని గమనించి తీర్పు ఇస్తే అబద్దపు ప్రకటన లతో మభ్యపెట్టాలని చూడడం మంచిది కాదని అన్నారు. ప్రజలు బ్రాహ్మణులు అన్ని గమనిస్తున్నారని గుర్తు చేశారుగత ప్రభుత్వ హయాంలో పేద బ్రాహ్మణ లకు ఉపయోగ పడే గరుడ పథకం ద్వారా అయిదు సంవత్సరాల కాలంలో చైర్మన్ గా ఉండి కూడా ఇవ్వలేక పోయారని మీరు కూటమి నాయకులు ను చంద్రబాబు ను విమర్శించడం హాస్య స్పదమని అన్నారు. అధికారం లోకి వచ్చిన వెంటనే దూపదీప నైవేద్యం మొత్తం 10000కు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వం ధి అని అన్నారు. ఇటువంటి చౌక బారు విమర్శలు మానుకొని నిర్మాణాత్మక విమర్శలు చేస్తే బాగుంటుంది అని హితవు పలికారు. బ్రాహ్మణ జాతి అభ్యుదయ కోసం సరి అయిన సూచనలు ఇస్తే స్వీకరిస్తారని కార్పొరేషన్ బలోపేతం కు దోహద పడుతుందని అన్నారు.
