కూటమి పాలనలో రాష్ట్రం పాకిస్థాన్ లా మారేలా ఉంది

భారత్ న్యూస్ శ్రీకాకుళం….కూటమి పాలనలో రాష్ట్రం పాకిస్థాన్ లా మారేలా ఉంది

  • మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ !

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలా ఏ ప్రభుత్వమూ ఇంతలా అప్పులు చేయలేదు

గతంలో సంక్షేమం , అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి వైసిపి పరిపాలిస్తే .. రాష్ట్రం శ్రీలంక లా అవుతుందని హేళన చేశారు

ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే రూ. లక్షా 59వేల కోట్ల అప్పులు చేయడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పాకిస్తాన్ లా మారింది

లక్షల కోట్లు అప్పులు గా తెచ్చిన ఆ డబ్బు ఏం చేశారో… ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పాలి