బీజేపీ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

భారత్ న్యూస్ నెల్లూరు….బీజేపీ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

బిహార్ జైత్రయాత్రను మిగతా రాష్ట్రాల్లోనూ కొనసాగించాలని బీజేపీ చూస్తోంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళలో మార్కు చాటడంపై ఫోకస్ చేసింది. బెంగాల్ నెక్స్ట్ టార్గెట్ అని నిన్న మోదీ చేసిన ప్రకటన దీనికి ఊతమిస్తోంది. అటు తమిళనాడులోనూ పాగా వేసేందుకు శతవిధాలా ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఇక కేరళలో యూడీఎఫ్, ఎల్డీఎఫ్ పోరును త్రిముఖంగా మార్చే ప్రణాళికల్లో ఉంది.