అపార్ట్‌మెంట్లో ఇద్దరమ్మాయిలు, ఇద్దరబ్బాయిలు.. ఫుల్లుగా డ్రగ్స్‌ తీసుకుని పడుకున్నారు.. ఆ తర్వాత..

..భారత్ న్యూస్ హైదరాబాద్….Hyderabad: అపార్ట్‌మెంట్లో ఇద్దరమ్మాయిలు, ఇద్దరబ్బాయిలు.. ఫుల్లుగా డ్రగ్స్‌ తీసుకుని పడుకున్నారు.. ఆ తర్వాత..

మత్తు ప్రాణాలు తీస్తుంది.. దాని జోలికి వెళ్తుద్దు.. మీతో పాటు.. మీ కుటుంబాన్ని కూడా బజారున పడేస్తుంది.. బంగారం లాంటి భవిష్యత్తును ఆగం చేసుకోవద్దు.. అంటూ ఎన్నిసార్లు చెప్పినా.. కొందరు పెడచెవిన పెడుతూ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఇంకా మరికొందరైతే.. ఏకంగా ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు.

మత్తు ప్రాణాలు తీస్తుంది.. దాని జోలికి వెళ్తుద్దు.. మీతో పాటు.. మీ కుటుంబాన్ని కూడా బజారున పడేస్తుంది.. బంగారం లాంటి భవిష్యత్తును ఆగం చేసుకోవద్దు.. అంటూ ఎన్నిసార్లు చెప్పినా.. కొందరు పెడచెవిన పెడుతూ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఇంకా మరికొందరైతే.. ఏకంగా ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. తాజాగా.. ఓ యువకుడు డ్రగ్స్ ఓవర్ డోస్‌తో మృతి చెందడం కలకలం రేపింది.. మరో యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో కలకలం రేపింది.. మోతాదుకు మించి డ్రగ్స్‌ తీసుకోవడంతో ఓ యువకుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి శివరాంపల్లి కెన్వర్త్ అపార్ట్మెంట్ ఫ్లాట్ నెంబర్ 805 లో గత కొంతకాలంగా అహ్మద్ అలీ అతని స్నేహితుడు.. మరో ఇద్దరు యువతులు లివింగ్ రిలేషన్షిప్ లో నివసిస్తున్నారు. గతరాత్రి అహ్మద్ అలీ (28) అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వెంటనే ఈ విషయాన్ని గమనించిన స్థానికులు రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు… పోలీసుల సంఘటన స్థలానికి చేరుకునే వరకు అహ్మద్ అలీ మృతి చెంది ఉన్నాడు.. మరో యువతి అపస్మారక స్థితిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

విచారణలో భాగంగా గత రాత్రి అహ్మద్ అలీతోపాటు మరో యువకుడు ఇద్దరు యువతులు డ్రగ్స్ పార్టీ నిర్వహించుకున్నట్లుగా పోలీసులు తెలుసుకున్నారు. అధికంగా డ్రగ్స్ వాడడం వల్లే అహ్మద్ అలీ మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.. అనుమానాస్పద మృతికి కింద కేసు నమోదు చేసిన రాజేంద్ర నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అహ్మద్‌ అలీ మొబైల్‌ టెక్నీషిషన్‌ పనిచేస్తున్నాడు. అపార్టెంట్‌మెంట్‌లో డ్రగ్స్ సేవించిన అలీ, మరో యువతి.. ఆ తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు.

ఇదిలాఉంటే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో డ్రగ్స్‌ మాఫియాపై పోలీసులు ఉక్కుపాదం మోపింది. పోలీసులు, ఎక్సైజ్‌ శాఖ రౌండ్‌ ది క్లాక్‌ నిఘా పెట్టి పెడ్లర్ల భరతం పడుతున్నారు. అంతేకాకుండా.. డ్రగ్స్ తీసుకుంటున్న వారిని కూడా గుర్తించి కౌన్సెలింగ్ ఇస్తున్నారు.. ఈ క్రమంలో… యువకుడు మృతిచెందడం కలకలం రేపింది.