భారత్ న్యూస్ నెల్లూరు….రూ.400 కోట్ల బంగారం కొనుగోలు చేసిన జగన్?
మాజీ సీఎం జగన్ పై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగం, రాజ్యం తనదే అన్నట్లు జగన్ వ్యవహరించారని, భారతీరెడ్డి కోసం రూ.400 కోట్ల బంగారం కొనుగోలు చేశారని తెలిపారు. లిక్కర్ కేసులో ఈడీ సోదాలు చేయగా.. భారీ ఎత్తున బంగారం కొనుగోలు చేసినట్టు బయటపడిందన్నారు. జగన్కు త్వరలో చెక్ పెట్టబోతున్నామని, లిక్కర్ కేసులో అవినాష్ రెడ్డి అరెస్టు ఖాయమన్నారు.
