..భారత్ న్యూస్ హైదరాబాద్….
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబాయి రెగ్యులర్ ప్రాదిపాదికన ఖాళీగా ఉన్న 122 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఇందులో మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టులు 59, మేనేజర్ క్రెడిట్ అనలిస్ట్, 63 పోస్టులు ఉన్నాయి. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ /ఎంబీఏ,/ పీజీ డీజీఏ,/ పీజీడీజీఎం,/ ఎం ఎం ఎస్,/ సీ ఏ, /సి ఎఫ్ ఏ,/ ఐసీడబ్ల్యూ ఏ/ బీటెక్/ బి ఈ/ ఎంసీఏ /ఉత్తీర్ణత సాధించి ఉండాలి…
అభ్యర్థులు అక్టోబర్ 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.750, SC, ST, దివ్యాంగులకు ఫీజు లేదు. షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://sbi.bank.in/
