MAV presented research paper on ‘Vaastu-Shastra’ at Agartala (Tripura)

భారత్ న్యూస్ హైదరాబాద,

అగర్తల (త్రిపుర)లో ‘వాస్తు-శాస్త్రం’పై పరిశోధనా పత్రం సమర్పించిన MAV

ఆధ్యాత్మిక సాధన చేయడం ద్వారా వాస్తులోపాల యొక్క హానికర ప్రభావాన్ని తగ్గించవచ్చు! – రాజ్ కర్వే, జ్యోతిష్యుడు, మహర్షి అధ్యాత్మ విశ్వవిద్యాలయం

“వాస్తు వ్యక్తుల జీవితాల్ని ప్రభావితం చేసినట్టే, వ్యక్తి కూడా వాస్తును ప్రభావితం చేస్తాడు. ఆధ్యాత్మికతను అభ్యసించే వ్యక్తి వాస్తుపై సానుకూల ప్రభావాన్ని చూపుతాడు. దీంతో వాస్తు లోపాల ప్రభావం తగ్గుతుంది” అని త్రిపుర రాష్ట్రంలో అగర్తలలో ‘ఆధునిక పరిస్థితుల్లో వాస్తు-శాస్త్ర సహకారం’ శీర్షికన జరిగిన జాతీయ సెమినార్‌లో మహర్షి అధ్యాత్మ విశ్వవిద్యాయానికి (MAV) చెందిన జ్యోతిష్యుడు మరియు ‘వాస్తు-శాస్త్ర’ పండితుడు రాజ్ కర్వే అన్నారు. ‘వాస్తు-శాస్త్ర ప్రకారం నిర్మించడం వల్ల కలిగే ప్రయోజనాల’పై పరిశోధనా పత్రాన్ని ఆయన సమర్పించారు. వాస్తు దోషాలను తొలగించడానికి సులభమైన ఆధ్యాత్మిక నివారణలను, ఆధ్యాత్మిక సాధన యొక్క ప్రాముఖ్యతను కూడా వివరించారు. ఆయన రచించిన ఈ పరిశోధనా పత్రానికి మార్గదర్శి సచ్చిదానంద పరబ్రహ్మ (డా) ఆఠవలె.

అక్టోబర్ 2016 నుండి నవంబర్ 2023 వరకు MAV 111 సెమినార్‌లలో శాస్త్ర పరిశోధనా పత్రాలను సమర్పించింది, వాటిలో 18 జాతీయ సెమినార్‌లు; 93 అంతర్జాతీయ సెమినార్‌లు. 13 పరిశోధనా పత్రాలకు అంతర్జాతీయంగా ఉత్తమ పరిశోధనా ప్రదర్శన అవార్డులు పొందాయి.

‘ఇంటి ప్రవేశ ద్వారం సరైన దిశలో ఉన్నప్పుడు ఇంట్లో సూక్ష్మ ప్రకంపనలు సానుకూలంగా ఉంటాయి. , అదే తప్పు దిశలో ఉంటే ప్రతికూల శక్తి ప్రవహిస్తుంది. ఇప్పటివరకు శాస్త్రీయ పరికరాలను ఉపయోగించి చేసిన ప్రయోగాలలో కూడా ఇది గమనించబడింది. సంక్షిప్తంగా, ‘వాస్తు-శాస్త్రం’ ప్రకారం ఇంటిని నిర్మించడం వల్ల సానుకూల ప్రకంపనలు ఏర్పడతాయి మరియు నివాసితులు ఆనందం మరియు శాంతిని అనుభవిస్తారు.’ అని శ్రీ రాజ్ కర్వే అన్నారు.

శ్రీ రాజ్ కర్వే తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, ‘వాస్తు-శాస్త్రం’ ప్రకారం ఇంటిని నిర్మించినప్పుడు, ఇంట్లో సానుకూల ప్రకంపనలు ఏర్పడతాయి, అలాంటి ప్రకంపనలను కాపాడుకోవడం ఆ ఇంట్లో నివసించే వారి ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి, తనకున్న అవలక్షణాలుతోనూ, అహంతోనూ తప్పుగా ప్రవర్తించి, ఇంట్లో ప్రతికూల ప్రకంపనలు సృష్టించవచ్చు. మరోవైపు, సద్గుణాలు కలిగిన వ్యక్తి తన సత్ప్రవర్తనతో ఇంట్లో సానుకూల ప్రకంపనలను సృష్టించడంలో సహాయం చేస్తాడు. ఆధ్యాత్మిక సాధన చేయడం వల్ల అవలక్షణాలు మరియు అహంకారం తగ్గి సద్గుణాలు పెరుగుతాయి. అలాగే, రజోగుణం, తమోగుణం తగ్గి సత్వగుణం పెరుగుతుంది. దీనితో వాస్తు సాత్వికంగా మారుతుంది. దీనికి ఉత్తమ ఉదాహరణ సాధువుల వాస్తు. సాధువులు ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమై ఉంటారు; అందుకే, వారు నివసించే స్థానంలో వాస్తు సాత్వికంగా మారుతుంది. అందుచేతనే భారతదేశంలో సాధువుల జన్మస్థలాలను, నివాసాలను మరియు ఉపయోగించిన వస్తువులను సంరక్షించే ఆచారం ఉంది. ఈ ఫలితాలపై పరిశోధన పత్రాలు ఇంతకు ముందు కూడా సమర్పించబడ్డాయి.

భవదీయుడు
ఆశిష్ సావంత్
పరిశోధనా విభాగం
మహర్షి ఆధ్యాత్మ విశ్వవిద్యాలయం
(ఫోన్ సంఖ్య: 9561574972)