తెలంగాణ భవన్ లో ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతి ఉత్సవాలు

భారత్ న్యూస్ హైదరాబాద్.

తెలంగాణ భవన్ లో ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతి ఉత్సవాలు

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి కామెంట్స్

సంఘం కోసం సమాజం కోసం పని చేసి శాశ్వతమైన ఖ్యాతిని సాధించుకున్న గొప్ప మహా మనిషి జ్యోతిబాపూలే

197 సంవత్సరాల క్రితం జన్మించిన పూలే గారు ఎంచుకున్న మార్గం ఆయన బోధనలు ఇప్పటికీ కూడా అందరికీ ఆచరణీయం

విద్యతోనే అనే వికాసం వస్తుంది అని బలమైన నమ్మకంతో తన ఇంటి నుంచే మార్పు మొదలుపెట్టి ముందుకు సాగిన గొప్ప వ్యక్తి

తన సతీమణి సావిత్రిబాయికి పాఠాలు చెప్పి ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది ఇద్దరు కలిసి దేశం మొత్తానికి ఆదర్శంగా నిలిచారు

సమాజంలోని అన్ని వర్గాలు జ్యోతిబాపూలే వారసత్వాన్ని ముందుకు తీసుకుపోవాలి

మనము ఏ కులం ఏ మతంలో పుట్టాలి అన్న విషయం మన చేతిలో లేదు… కానీ అవకాశాల కల్పన, ఉపాధి కల్పన అందరికీ సమాన హక్కులు ఇవ్వాల్సిన బాధ్యత ఇచ్చే అవకాశం సమాజానికి ప్రభుత్వానికి ఉన్నది…

ఈ విషయంలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వానికి వివిధ రకాల సలహాలు, సూచనలు ఇస్తూ బాధ్యతను నిర్వహిస్తాం

75 సంవత్సరాల భారత స్వాతంత్ర చరిత్రలో మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపించిన ప్రభుత్వం గత పది సంవత్సరాల మా ప్రభుత్వం అని గర్వంగా చెప్పగలుగుతాం

విద్యతోనే వికాసం… వికాసం తోనే సమానత్వం అన్న పూలే గారి ఆలోచనలో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా 1000 కి పైగా గురుకుల పాఠశాలలను పెట్టి విద్యను అందించాం

ఒక్కో విద్యార్థి పైన 1,25,000 ఖర్చుతో అంతర్జాతీయ స్థాయి విద్య అందించాం

మహాత్మా జ్యోతిబాపూలే చెప్పిన స్ఫూర్తి తోనే ఈ కార్యక్రమం కొనసాగింది

ప్రతి పాఠశాలను ఇంటర్మీడియట్ కాలేజీకి అగ్రీడ్ చేశాను… బీసీ విద్యార్థుల కోసం 33 డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీలు పెట్టాం

మహాత్మ జ్యోతిబాపూలే పేరుతో 20 లక్షల రూపాయల ఓవర్సీస్ ఫెలోషిప్ ను అందించాం… ఈ విషయంలో దళిత గిరిజన బహుజన అగ్రవర్ణ పేదలు అన్న వివక్ష చూడలేదు

టాటాలు, బిర్లాలు ముఖ్యమే కాదు తాతలనాటి కుల వృత్తులు కూడా అంతే ముఖ్యమని ఆచరణాత్మకంగా వాటికి ఒక కొత్త రూపుని గౌరవాన్ని అందించాం

దేశమంతా స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు… శతాబ్దాలుగా అందుబాటులో ఉన్న బహుజన వర్గాల నైపుణ్యం గురించి మాట్లాడిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు

అగ్గిపెట్టెలో పట్టిన చీర వేసే నేతన్న నైపుణ్యాన్ని తిరిగి గుర్తించాము…

బడుగు బలహీన వర్గాలకు ఉన్న అద్భుతమైన నైపుణ్యాన్ని కాపాడి వాటికి భద్రత ఇచ్చి అనేక కార్యక్రమాలను బడుగు బలహీన వర్గాల కోసం చేపట్టం